భారత్, చైనా వివాదాన్ని గమనిస్తున్నాం : అమెరికా
డోక్లాం ప్రాంతంపై భారత్, చైనా దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతను సునిశితంగా గమనిస్తూనే ఉన్నామని అమెరికా తెలిపింది. రెండు దేశాలూ నేరుగా మాట్లాడుకుని వివాదాన్ని పరిష్కరించుకోవాలని ట్రంప్ ప్రభుత్వం సూచించింది. పరస్పర చర్చలను తాము ప్రోత్సహిస్తామని అమెరికా విదేశీవ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి హెదర్ నారెట్ తెలిపారు.








