స్టార్టప్ వీసాలపై డొనాల్డ్ ట్రంప్ వేటు
హెచ్-1బి వీసాలపై వేటుతో అమెరికాలోని విదేశీ నిపుణుల వలసపై వేటు వేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్టార్టప్ వీసాలపై కూడా దృష్టి పెట్టారు. అమెరికాలో స్టార్టప్ కంపెనీలను ప్రారంభించే విదేశీ ఔత్సాహికుల కోసం ఒబామా ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ రూల్ పేరుతో ఒక స్కీమ్ ప్రకటించింది. ఈ స్కీమ్ కింద అమెరికా ప్రభుత్వం నుంచి లక్ష డాలర్ల గ్రాంటు లేదా 2.5 లక్షల డాలర్ల వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు లభించిన స్టార్టప్ కంపెనీల ప్రమోటర్లకు అమెరికాలో నివసించేందుకు ఈ స్కీమ్ కింత అనుమతి ఇస్తారు. మొదట 30 నెలల కాలానికి ఆ తర్వాత మళ్లీ మరో 30 నెలల కాలానికి నివాస అనుమతులను పొడగిస్తారు. ఒబామా పదవి చివరి రోజుల్లో ఈ స్కీమ్‌ను ఖరారు చేశారు.













