హెచ్-1 బీ లాటరీయే!
హెచ్-1బీ వీసాల ఎంపికకు అనుసరిస్తున్న లాటరీ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని అమెరికా కోర్టు తోసిపుచ్చింది. హెచ్-1బీ వీసాలకు ఎక్కువగా భారతీయ ఐటీ నిపుణులే దరఖాస్తు చేస్తారు. ఒరెగాన్ కోర్టు తీర్పుతో ఏప్రిల్ 3న మొదలయ్యే 2018 ఆర్థిక సంవత్సరపు హెచ్-1బీ వీసాల ప్రక్రియ ప్రస్తుతం ఉన్న పద్ధతితోనే సాగనుంది. అమెరికా చట్టసభ కాంగ్రెస్ నిర్ణయం ప్రకారం ఏటా 65 వేల హెచ్-1బీ వీసాలకు అనుమతిస్తారు. అమెరికాలో చదివిన విద్యార్థుల కోసం అదనంగా మరో 20 వేల హెచ్-1బీ వీసాలు ఇస్తున్నారు. దరఖాస్తులు లక్షన్నరకు పైగా రావడంతో లాటరీ పద్ధతిని అనుసరిస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ రెండు అమెరికా కంపెనీలు కేసు వేశాయి. లాటరీ కన్నా మెరుగైన పద్ధతిని పిటిషన్లు సూచించలేదని న్యాయమూర్తి అన్నారు. కాగా హెచ్-1బీ వీసాలపై సీలింగ్ విధించడం అర్థరహితమని నార్త్ కరోలినా నుంచి ఎన్నికైన సెనెటర్ థామ్ టిలిస్ అన్నారు.













