కళలకు భాషతో సంబంధం లేదు : కాన్సుల్ జనరల్ అశోక్
భావాలను భాషతో సంబంధం లేకుండా చెప్పడమే కళ అని అంటూ, ఆ కళలకు భాషతో సంబంధం లేదని అవి భావాలను భాషరహితంగా చేరవేసే అద్భుతమైన మార్గాలని శాన్ఫ్రాన్సిస్కో భారత కాన్సులేట్ కాన్సుల్ జనరల్ అశోక్ వెంకటేశన్ అన్నారు. మిల్పిటాస్లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో అకిల అమెరికా కూచిపూడి సమ్మేళానికి ఆయన అతిథిగా హాజరయి ప్రసంగించారు. ఏపీ నాటక అకాడమీ అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ సత్యభామ శ్రీకృష్ణ సంభాషాణల మధ్య పదాలను ఆలపించగా అశోక్ దానికి ప్రతిస్పందిస్తూ గోపాలకృష్ణ ఆలపించిన తెలుగు పద్యం అర్థం తనకి తెలియకపోయినా దాని విలువను, భావాన్ని ఆర్థ్రతను తాను అర్థం చేసుకోగలిగానని ఆ శక్తి కళలకు ఉన్నదని ఆయన సంతోషంగా చెప్పారు.













