హెచ్1బీ వీసాలపై అమెరికా కఠిన నిబంధనలు
విదేశాలకు చెందిన ప్రత్యేక వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్1బీ వీసా నిబంధనల్ని కఠినతరం చేస్తూ ట్రంప్ సర్కారు ‘న్యూ పాలసీమెమొరాండం’ పేరిట కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిమేరకు ఇక నుంచి సాధారణ కంప్యూటర్ ప్రోగ్రామ ర్ను‘ప్రత్యేక వృత్తి నిపుణుడు’గా (హెచ్1బీ పొందేందుకు అర్హత ఉన్నవారు) గుర్తించబోమని అమెరికా స్పష్టం చేసింది.
ఇదే భారతీయ నిపుణులకు అశనిపాతం కానుంది. ఎక్కువ మంది కంప్యూటర్ ప్రోగ్రామర్లు హెచ్1బీ వీసాలపైనే అమెరికావెళ్తున్నారు. వీరిని నిపుణులుగా గుర్తిస్తూ 2000 డిసెంబరు 22న మెమోరాండం జారీచేసిన యూఎ్‌ససీఐఎస్.. దీనిని పూర్తిగామార్చుతూ గత నెల 31న కొత్త రూలింగ్ ఇచ్చింది. దశాబ్దన్నర క్రితం అప్పటి అవసరాల మేరకు రూపొందించినమార్గదర్శకాలు ప్రస్తుత విధానానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్లు యూఎస్సీఐఎస్ వెల్లడించింది. డిసెంబర్ 22, 2000న జారీచేసిన మార్గదర్శకాల్ని పూర్తిగా రద్దు చేస్తూ ప్రత్యేక నైపుణ్యత అంటే ఏమిటో తాజాగా స్పష్టం చేసింది. కొత్త నిబంధనలమేరకు ‘విదేశానికి చెందిన ఒక వ్యక్తి కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా ఉద్యోగం పొందినా.. అతనికున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనైపుణ్యం, పరిజ్ఞానంతో కంపెనీ లక్ష్యాలు సాధించేందుకు సాయపడినా.. ప్రత్యేక నిపుణుడిగా పరిగణించేం దుకు అవి సరిపోవు.కంప్యూటర్ ప్రోగ్రాం ఉద్యోగం కోసం దర ఖాస్తుదారుడ్ని కంపెనీ (స్పాన్సర్) ఎంచుకున్నప్పుడు.. కేవలం నియమావళిలోపేర్కొన్న ‘ప్రత్యేక వృత్తి నిపుణత’ మార్గదర్శకాలను పాటిస్తే చాలదు, ఆ ప్రత్యేక ఉద్యోగం… ప్రత్యేక వృత్తి నిపుణత కోవకు చెందినదేనని కంపెనీ రుజువు చేయాలి’ అని పేర్కొంది.













