సునీతా విలియమ్స్ రికార్డు బద్దలు
అత్యధికసార్లు స్పేస్‌వాక్ నిర్వహించిన మహిళగా భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ పేరుమీద ఉన్న రికార్డు బద్దలైంది. అమెరికాకు చెందిన వ్యోమగామి పెగ్గీ విట్సన్ (57) సరికొత్త రికార్డు సృష్టించారు. అమె అంతరిక్ష కేంద్రం నుంచి ఎనిమిదోసారి స్పేస్‌వాక్ నిర్వహించారు. గతంలో సునీతా విలియమ్స్ ఏడుసార్లు అంతరిక్షంలో నడిచారు. ఈ సందర్భంగా నాసా పెగ్గీ వాషింగ్టన్కు శుభాకాంక్షలు తెలిపింది.







