భారత్‌కు డ్రోన్ల అమ్మకానికి అమెరికా ఓకే
భారత్‌కు 22 మానవ రహిత గార్డియన్ డ్రోన్ విమానాల అమ్మకానికి అమెరికా పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కాబోతున్న తరుణంలో తీసుకున్న ఈ నిర్ణయం భారత్ పట్ల అమెరికా సానుకూల ధోరణిని సూచిస్తున్నదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒప్పందం విలువ రెండు నుంచి మూడు బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.13,600-20,400 కోట్లు) ఉంటుందని అమెరికా అధికారవర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. విదేశాంగ శాఖ ఈ ప్రతిపాదనకు అమోదం తెలిపిందని, భారత్‌కు తయారీదారుకు ఈ మేరకు సందేశాలు వెళ్లాయని ఓ అధికారి తెలిపారు.








