ఏ చీర కట్టుకోవాలో చెప్పండి ప్లీజ్
భారత్లో అమెరికా దౌత్యవేత్తగా పనిచేస్తున్న మేరీకే కార్ల్సన్పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆగస్టు 15న ఆమె చీరలు ధరించడానికి ట్విట్టర్లో అందరూ కొనియాడుతున్నారు. భారత స్వాతంత్య్ర వేడుకల్లో చీర ధరించి పాల్గొనాలనుకుంటున్నానని, ఏది ధరిస్తే బాగుంటుందో మీరే సలహాఇవ్వండి ప్లీజ్ అంటూ ట్విట్టర్లో శారీసెర్చ్ పేరిట ఆమె ఓ విన్నపం చేశారు. పలు రకాల చీరలు కట్టుకుని, వీడియోలను రూపొందించి తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. అంతిమంగా ఆగస్టు 4 నుంచి నాలుగు రకాల చీరలు జామ్దానీ, దుపియన్, కాంజీవరమ్, టస్సర్లను ఫైనల్ చేశారు. ఇందులో ఏదో ఒకటి సూచిస్తే, అదే కట్టుకుంటానన్నారు మేరీ. దీనిపై దాదాపు 2000 వేలమంది ట్విట్టర్లో స్పందించారు. ఎక్కువమంది కోరిక మేరకు కాంజీవరమ్ చీరతో ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో ఉంచగా, 150 మంది కి పైగా రీట్వీట్ చేశారు. తరువాత ఎక్కువమంది సూచించిన టస్సర్ చీరధరించి, రాష్ట్రపతిభవన్లో జరిగిన ఎట్హోంలో పాల్గొన్నారు.








