లెగింగ్స్ ధరించినందుకు విమాన ప్రయాణం నిరాకరణ
అమెరికాలో ఒక ప్రముఖ విమానయాన సంస్థ ఇద్దరు బాలికలను వారి వస్త్రధారణ కారణంగా విమానంలో ప్రయాణించేందుకు అనుమతించకపోవడంపై దుమారం రేగింది. ఆదివారం వీరు యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానంలో డెన్వర్ నుంచి మిన్నెపొలిస్ వెళ్లాల్సి ఉండగా, లెగింగ్స్ ధరించినందుకు వీరిని డెన్వర్ విమానాశ్రయంలో ఈ సంస్థ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ చర్యపై కొందరు సినీ నటులు, ఇతర నెటిజన్లు నుంచి ఆన్లైన్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇది వివక్షపూరిత మైనదని, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని మండిపడ్డారు. డెన్వర్లోనే లెగింగ్స్ ధరించిన మరో బాలికను దుస్తులు మార్చుకున్న తర్వాతే ఈ సంస్థ సిబ్బంది విమానం ఎక్కేందుకు అనుమతించారని ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది.













