ప్రపంచ దేశాలతో కలిసి రాకపోతే ప్రమాదం
ప్రపంచ దేశాలతో కలిసి రాకపోతే ఏకాకిగా మారే ప్రమాదం వుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అమెరికాను హెచ్చరించారు. అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం అనేక అంశాలతో ప్రపంచదేశాలతో విభేదిస్తున్నదని, ఇది ఇటు అమెరికాకు కానీ అటు ప్రపంచానికి కానీ ఏ మాత్రం మంచిది కాదని తన తొలి మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వం సిరియా విషయంలో ఇటు ఐరాసతోనూ, అటు రష్యాతోనూ నేరుగా ఘర్షణకు దిగటం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. అమెరికా సిరియన్ యుద్ధ విమానాన్ని కూల్చటం ద్వారా రాజుకున్న వివాదాన్ని సాధ్యమైనంత త్వరలో పరిష్కరించాలని ఆయన ట్రంప్ సర్కారుకు సూచించారు.













