పర్యావరణ పరిరక్షణకు అమెరికా కట్టుబడి ఉంది
పర్యావరణ పరిరక్షణకు అమెరికా కట్టుబడి ఉందని ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ ప్రతినిధి నిక్కీ హేలీ సృష్టం చేశారు. పారిస్ ఒప్పందం నుంచి బయటకు వచ్చినంతమాత్రాన అమెరికా పర్యావరణాన్ని ఇక ఏమాత్రమూ పట్టించుకోబోదు అనేది తప్పుడు అభిప్రాయమని అన్నారు. కర్బన ఉద్గారాల నియంత్రణకు తమ దేశం తనవంతు ప్రయత్నం చేస్తుందని తెలిపారు. వాతావరణం మారుతున్నదన్న విషయాన్ని, అందుకు అమెరికాకూ బాధ్యత ఉందన్న అంశాన్ని అధ్యక్షుడు ట్రంప్ గుర్తించాలని ఆమె సూచించారు.








