డొనాల్డ్ ట్రంప్ కు ట్విటర్ క్షమాపణలు
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడంతో తోడ్పడినందుకు భారీ సామాజిక అనుసంధాన వేదిక ట్విటర్ క్షమాపణలు చెప్పింది. ప్రముఖ వార్త సంస్థ ముఖాముఖిలో సంస్థ మాజీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు ఇవాన్ విలియమ్స్ మాట్లాడారు. తన గెలుపులో ట్విటర్ క్రియాశీల పాత్ర పోషించిందని ట్రంప్ గత మార్చిలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వీటిపై ఇవాన్ స్పందించారు. ఆ గెలుపులో ట్విటర్ పాత్ర ఉండటం దురదృష్టకరం. ట్విటర్ లేకపోతే ఆయన అధ్యక్షుడు కాలేడన్న సంగతి వాస్తవమే అయితే, అందరూ మమ్మల్ని క్షమించాలి అని ఇవాన్ వ్యాఖ్యానించారు. అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టేనాటికి ట్విటర్లో ట్రంప్ మద్దతు దారుల సంఖ్య 1.7 కోట్లు. ప్రస్తుతం ఇది మూడు కోట్ల పైమాటే. ఆయన తరచూ ఈ సామాజిక అనుసంధాన వేదికపై వివాదాస్పద ట్వీట్లు చేసే సంగతి తెలిసిందే.








