ట్రంప్ ట్వీట్లను ఆపలేం
అమెరికా అధ్యక్షుడు చేసే ట్వీట్లను ఆపే ప్రసక్తే లేదని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే సృష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు చేసే ట్వీట్లు చాలా ముఖ్యమైనవని, ఆయన చెప్పాలనుకుంటున్న దానిని వినడం ఎంతో ముఖ్యమని చెప్పారు. ట్వీట్ చేయకుండా ఆయనను ఆపాలని ఎవరూ భావించకూడదని అన్నారు. విల్లీ గీస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈవిధంగా స్పందించారు. మన దేశాధినేత అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవడం మనకు ఎంతో అవసరమనే విషయాన్ని తాను నమ్ముతున్నానని చెప్పారు. ట్రంప్ ట్వీట్లు కొన్నిసార్లు నొచ్చుకునే విధంగా ఉన్నప్పటికీ, అవన్నీ మన మంచికేనని తెలిపారు. ట్విట్ చేయకుండా ట్రంప్‌ను ఆపలేమని సృష్టం చేశారు.













