డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
తన సన్నిహిత మిత్రదేశమైన దక్షిణ కొరియాతో కుదిరిన స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ -ఎఫ్టీఏ) నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తన సలహాదారులను ఆదేశించారు. ఔను నేను దీని పైనే ఆలోచిస్తున్నానని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దేశంలోని పరిశ్రమలను రక్షించడం కోసమే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.








