చైనాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
చైనాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఉత్తర కొరియాను నియంత్రించే విషయంలో చైనా ఏమాత్రం సహకరించడం లేదని, దీనికి చైనా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, ఆ దేశంపై వాణిజ్యపరమైన ఆంక్షలు(చర్యలు) తప్పవని ట్రంప్ హెచ్చరించారు. వాణిజ్యపరంగా చైనాను దెబ్బకొట్టాలనే కోణంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారమే ఆయన యూరప్ పర్యటనకు బయలుదేరారు. జర్మనీలోని హాంబర్గ్‌లో జరగనున్న జీ-20 సదస్సు కోసం ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ కానున్నారు. కానీ ఈలోగానే చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయంగా మారింది.













