ఉత్తర కొరియాకు ట్రంప్ హెచ్చరిక
సైనిక చర్యల మార్గాన్ని ఎంచుకుంటే ఉత్తర కొరియా విధ్వంసక పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అయితే సైన్యాన్ని ప్రయోగించడానికి తాము అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పారు. శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండో మార్గానికే మేం సిద్ధంగా ఉన్నాం. సైనిక చర్యలనే ఎంచుకోవాల్సివస్తే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఉత్తర కొరియా ఇప్పటికే వీటికి పిలుపునిచ్చింది. అవసరమైతే మేము వీటినే ఆశ్రయిస్తాం అని చెప్పారు.








