మత స్వేచ్ఛకు పూర్తి మద్దతిస్తాం: ట్రంప్
అమెరికన్ల మతపరమైన స్వేచ్ఛకు పూర్తి మద్దతిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. తీవ్రవాద ముప్పు అనేది ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మతపరమైన స్వేచ్ఛకు ప్రధాన ముప్పుగా పరిణమించిందని అన్నారు. దేశంలో తీవ్రవాదం విస్తరించడానికి ఎంత మాత్రమూ అనుమతింబోమని సృష్టం చేశారు. తీవ్రవాదులు మన నగరాల్లో లేదా తీరప్రాంతాల్లో ఆశ్రయం పొందడానికి అనుమతించేది లేదని అన్నారు. యోధుల గౌరవార్థం నిర్వహించిన సెలబ్రేట్ ఫ్రీడమ్ సంగీత కచేరీ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, తమ దేశంతో చేతులు కలపాలని కోరుకునేవారెవరైనా తమ విలువలను పంచుకోవాలని, తమ ప్రజలను ప్రేమించే గుణం కలిగి వుండాలని అన్నారు.













