హరికేన్ బాధితులకు డొనాల్డ్ ట్రంప్ పరామర్శ
హరికేన్ ఇర్మా ధాటికి అతలాకుతలమైన ఫ్లోరిడా రాష్ట్రాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందర్శించారు. నేపుల్స్లో పర్యటించిన ఆయన బాధితులను పరామర్శించారు. హరికేన్ ప్రభావిత ప్రాంతాల్లో అత్యంత సమర్థంగా సాయమందించిన సహాయక సిబ్బందిని అభినందించారు. బాధితులను తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సృష్టం చేశారు. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, ఉపాద్యక్షుడు పెన్స్ కూడా ఉన్నారు.








