ముస్లిం దేశాలకు డొనాల్డ్ ట్రంప్ కొత్త రూల్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వివాదాస్పద నిషేధాజ్ఞలను ఆ దేశ సుప్రీంకోర్టు ఇటీవల పాక్షికంగా పునరుద్దరించిన నేపథ్యంలో ఆరు ముస్లిం దేశాలకు వీసాల జారీలో కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రజలు, శరణార్థులు, అమెరికాలోని వ్యక్తులు లేదా సంస్థలతో దగ్గరి సంబంధం కలిగి ఉండాలని ప్రభుత్వం సృష్టం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధననలు సదరు ముస్లిం దేశాల్లోని ఎంబసీలకు పంపించారు. వీసా దరఖాస్తు చేసుకునే వారు కచ్చితంగా తమ సంబంధాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నేటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాల నుంచి వచ్చే వ్యక్తులు అమెరికాలోని వ్యక్తులు లేదా సంస్థలతో అత్యంత దగ్గరి సంబంధం కలిగి ఉండాలి.













