అమెరికాకు చైనా మీడియా హెచ్చరికలు
అగ్ర రాజ్యం అమెరికాకు చైనా మీడియా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా సాంకేతికత, మేధో సంపత్తి చోరికి చైనా పాల్పడిందనే ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారణకు ఆదేశించాలని భావిస్తే, ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్దం తప్పదని హెచ్చరించింది. చైనా డైలీ పత్రికలో అంతర్జాతీయ వాణిజ్య, ఆర్థిక సహకార సంస్థకు చెందిన అధికారి మై జిన్ యూ ఈ విషయంపై ఆర్టికల్ రాశారు. మేధో సంపత్తి చోరీ అంశంపై ట్రంప్ దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉందని, దీంతో ఇరు దేశాల మధ్య మరిన్ని ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికా సాంకేతికతను, మేధో సంపత్తిని చైనా చోరీ చేసిందంటూ వాణిజ్య చట్టం 1974లోని సెక్షన్ 301 ప్రకారం ట్రంప్ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.








