డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటన ఖరారైంది. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి విదేశీ పర్యటన నిమిత్తం ఆయన బెల్జియంకు వెళ్లనున్నారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) దేశాల సదస్సు నిమిత్తం ట్రంప్ మే 25న బెల్జియంలోని బ్రస్సెల్స్కు వెళ్లనున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్డడించాయి. నాటో దేశాల అధిపతులను కలిసేందుకు, నాటోతో బంధాన్ని చేసుకునేందుకు, కూటమికి సంబంధించి కీలక అంశాలు, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం గురించి చర్చించడానికి ట్రంప్ ఎదురుచూస్తున్నారని ఓ ప్రకటనలో తెలిపింది.













