ఐపీ సిజార్ గా భారతీయ అమెరికన్
అమెరికా కొత్త ఐపీ సిజార్ (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎన్ ఫోర్స్మెంట్ కోర్డినేటర్)గా భారతీయ అమెరికన్ విశాల్ జే అమిన్ పేరును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెనేట్‌కు పంపారు. ఆ పదవిలో ఉన్నవారు దేశంలో పేటెంట్లు, కాపీరైట్, ట్రేడ్‌మార్క్‌లకు సంబంధించి చట్టాల అమలు విధానాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. అమిన్ ప్రస్తుతం సభ జ్యుడీషియరీ సంఘం సీనియర్ కౌన్సిల్‌గా ఉన్నారు. సెనేట్ ధ్రువీకరించిన అనంతరం ఆయన శ్వేతసౌధంలో డేనియల్ మార్టి స్థానంలో ఐపీ సిజార్గా బాధ్యతలు చేపడతారు.






