త్వరలో కొత్త ఆరోగ్య చట్టం!
అమెరికాలో కొత్త ఆరోగ్య పరిరక్షణా చట్టాన్ని త్వరలోనే అమలులోకి తేనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గత ఒబామా ప్రభుత్వం అమలు చేసినా ఒబామా కేర్ చట్టాన్ని రద్దు చేసేందుకు తన వంద రోజుల పాలనలో విఫలయత్నం చేసిన ట్రంప్ దానికి కొన్ని సవరణలు చేసి కొత్త చట్టాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఆరోగ్య పరిరక్షణా చట్టం త్వరలోనే అమలులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. తక్కువ ప్రీమియంలతో ఆరోగ్య పరిస్థితిని పరిరక్షించేందుకు అవసరమైన, సులభతరమైన నియమ నిబంధనలతో ఈ చట్టాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు.








