అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం ఉండొచ్చు: ట్రంప్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీకి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకొని ఉండవచ్చు అని ట్రంప్ అన్నారు. రష్యాతో పాటు మిగతా దేశాల పాత్ర కూడా ఉండొచ్చని, అయితే వాస్తవమేమిటో ఎవరికీ తెలియదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఓవైపు రష్యా పాత్రపై అమెరికా విచారణ జరుపుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఎన్నో నెలల ముందుగానే సీఐఏ హెచ్చరించింది. మరి ఒబామా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేపోయింది? అని ట్రంప్ ప్రశ్నించారు.








