హిల్లరీ ప్రతిష్టను దెబ్బతీసే సమాచారం కోసం ప్రయత్నించా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన తండ్రి ప్రత్యర్థి, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ప్రతిష్టను దెబ్బతీసే సమాచారం కోసం ప్రయత్నించినట్లు జూనియర్ ట్రంప్ తెలిపారు. వాషింగ్టన్ పోస్ట్ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. రష్యాకు చెందిన నటాలియా వెసెల్నిస్కాయా అనే న్యాయవాది హిల్లరీని ఆప్రతిష్టపాలు చేసే సమాచారం ఇస్తానని చెప్పాడు. అందుకే న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో గతేడాది జూన్ 9న అతనితో భేటీ అయ్యాను. అతని నుంచి ఆశించిన కీలక సమాచారం లభించలేదు. ఆ సమయంలో నాతో పాటు ట్రంప్ మేనల్లుడు జేర్డ్ కుస్నర్ కూడా ఉన్నారు.2013లో మిస్ యూనివర్స్ టైటిల్ గ్రహీత పెగంట్ ఈ వ్యవహారంలో నాకు సహకరించారు అని జూనియర్ ట్రంప్ అన్నారు.













