టూర్ లో ట్రంప్
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతర్గతంగానూ, బహిర్గతంకానూ సమస్యలు, సవాళ్లతో సతమతమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు 17 రోజుల వ్యాహ్యాళికి వెళ్లారు. సెంట్రల్ న్యూజెర్సీలోని తన సొంత గోల్ఫ్ క్లబ్లో ట్రంప్ విశ్రాంతి తిసుకుంటారు. ఆయనతోపాటు కుమార్తె ఇవాంకా ట్రంప్, అల్లుడు ఖుష్నేర్, కొందరు సహాయకులు ఉన్నారు. ఆయన వ్యాహ్యాళిలో ఉన్నప్పటికీ పాలనా వ్యవహారాలకు సంబంధించిన అన్ని అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని సూచనలు చేస్తారని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు.








