సరైన అనుతుల్లేనివారిలో భారతీయుల సంఖ్య 5 లక్షలు?
అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారుల్లో భారతీయుల సంఖ్య 5 లక్షల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో అధికశాతం మంది టూరిస్ట్, స్టూడెంట్, టెంపరరీ వీసాలపై వచ్చిన వారే. దేశంలో అక్రమంగా ఉంటున్న వలసదారులందరనీ వెళ్లగొడతానని ట్రంప్ ఎన్నికల సమయంలో అమెరికన్లకు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సరిహద్దులను దాటి అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారి పట్ల కఠినంగా వ్యవహరించారు. దీంతో సరిహద్దులను దాటి దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అక్రమ వలసదారులను గుర్తించిన తర్వాత వారిని వారి దేశాలకు తిప్పి పంపించే ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు.













