పాకిస్థాన్ కు అమెరికా షాక్
ఉగ్రవాదంపై పోరు కోసం పాకిస్తాన్కు అందిస్తున్న నిధుల్లో కోత విధించాలని ట్రంప్ సర్కార్ ప్రతిపాదించింది. సంకీర్ణ కూటమి నిధుల్లో (సీఎస్ఎఫ్) 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ645 కోట్లు) మేర కోత విధించాలని నిర్ణయించింది. తదుపరి ఆర్థిక సంవత్సరం 900 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5,800 కోట్లు)కు బదులుగా 800 మిలియన్ డాలర్లు (దాదాపు 5,160 కోట్లు)ను మాత్రమే ఇవ్వాలని బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.








