అప్పీల్స్ కోర్టులో భారతీయుడికి కీలక పదవి
అమెరికాలోని శక్తివంతమైన అప్పీళ్ల కోర్టులో న్యాయమూర్తి పదవికి భారతీయ అమెరికన్ అమూల్ థాపర్ పేరును ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు సెనేట్ ఆమోదం లభిస్తే 47 ఏళ్ల థాపర్ ఆరో సర్క్యూట్ అప్పీళ్ల కోర్టులో న్యాయమూర్తిగా సేవలందించనున్నారు. కెంటుకీ, టెనెస్సీ, ఒహైయో, మిషిగన్ రాష్ట్రాల నుంచి వచ్చిన అప్పీళ్లలో ఆరో సర్కూట్ కోర్టు విచారిస్తుంది. ఈ పదవికి ట్రంప్ ప్రతిపాదించిన తొలి భారతీయ అమెరికన్ వ్యక్తి థాపర్. ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్, సుప్రీంకోర్టుకు ప్రతిపాదించేందుకు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో థాపర్ పేరు ఉంది.













