యుద్ధం వస్తే భారత్ వైపే అమెరికా
చైనాతో నెలకొన్న వివాదాన్ని భారత్ పరిష్కరించుకోగలదని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా హయాంలో పెంటగాన్‌లో పనిచేసిన కీలక అధికారి తెలిపారు. అమెరికా, భారత్ మధ్య బంధం చాలా దృఢంగా ఉందని ఆయన తెలిపారు. దానికి నిదర్శనం భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించిన విధానమని ఆయన చెప్పారు. భారత్‌కు ఎవరి సాయమైనా అవసరమవుతుందని తాను భావించడం లేదని అన్నారు. అభివృద్ధి చెందిన ఎన్నో దేశాలకు తీసిపోని విధంగా భారత్ వృద్ధి సాధిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ పరంగా భారత్ సాధిస్తున్న విజయాలు చైనాకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయని, అందుకే భారత్‌ను రెచ్చగొట్టేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు. భారత్, చైనా దేశాల మధ్య యుద్ధం అనివార్యమైన పక్షంలో అమెరికా, భారత్ పక్షాన నిలబడుతుందని ఆయన తెలిపారు. అయితే భారత్‌కు ఒకరి సాయం అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక వైపు భారత్‌ను చైనా ఇబ్బంది పెడుతుండగా, పాకిస్తాన్ కూడా చైనా సరసన చేరి భారత్‌ను దెబ్బ తీసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు. అయితే, పాక్ కల ఫలించే అవకాశం లేదని ఆయన సృష్టం చేశారు.








