హెచ్-1బీ వీసాల దుర్వినియోగాన్నిఆపండి
ఔట్సోర్సింగ్ సంస్థలు హెచ్-1బీ, ఎల్-1 వీసాలను దుర్వినియోగం చేస్తూ అమెరికన్ల స్థానంలో తక్కువ జీతాలకు విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకొంటున్నాయని అమెరికాలోని పలువురు ప్రభావవంతమైన శాసనకర్తలతో కూడిన బృందం పేర్కొంది. ఈ వీసాల దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని కోరుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు జులై 27న లేఖ రాసింది. లేఖ ఆగస్టు 2న విడుదలైంది. బృందంలో రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలకు చెందిన ప్రతినిధుల సభ సభ్యులు సెనేటర్లు ఉన్నారు.








