డొనాల్డ్ ట్రంప్ పై కార్టూనిస్టుల దాడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కార్టూనిస్టులు కసి తీర్చుకున్నారు. టెహ్రాన్‌లో జరిగిన పోటీల్లో ట్రంప్‌పై వివిధ రకాలు కార్టూన్లు వేశారు. వెరైటీ కార్టూన్లతో అమెరికా దేశాధినేతపై దాడి చేశారు. డాలర్ బిల్లులతో జాకట్ వేసుకున్న ట్రంప్ కార్టూన్ హైలెట్‌గా నిలిచింది. కార్టూనిస్టు హది అసది దాన్ని వేశాడు. ఆ కార్టూన్‌కు అవార్డు దక్కింది. ప్రతి ఏడాది ఏదో ఒక థీమ్‌తో టెహ్రాన్‌లో కార్యూటన్ కాంపిటీషన్ నిర్వహిస్తారు. ట్రంప్‌ను హిట్లర్‌తో పోలుస్తూ కూడా కార్టూన్ వేశారు. మెక్సికో వాల్ దగ్గర ఉన్నట్లు, మెలానియాను నవ్విస్తున్నట్లు, చిన్నపిల్లోడిలా ఉన్న ట్రంప్ కార్టూన్లు చూపరులను ఆట్టుకున్నాయి.








