నవాజ్ షరీఫ్ తో డొనాల్డ్ ట్రంప్ భేటీ
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలవడం సంతోషంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సౌదీ రాజధాని రియాద్‌లోని కింగ్ అబ్దుల్అజీజ్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరిగిన అరబ్ ఇస్లామిక్ అమెరికన్ సమ్మిట్‌కు హాజరైన ట్రంప్ షరీఫ్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం మాట్లాడుతూ షరీఫ్‌ను కలవడం చాలా సంతోషంగా ఉందని, ఆయన కూడా ఇలాగే భావిస్తున్నారని తెలిపారు. సౌదీ రాజు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్అజీజ్ ఆహ్వానం మేరకు షరీఫ్ తన సలహాదారు సర్తార్ అజీబ్తో కలిసి శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. పాకిస్తాన్‌తో పాటు బంగ్లాదేశ్, మలేసియా, ఆఫ్గానిస్తాన్, ఈజిప్ట్ తదితర దేశాధినేతలతో పాటు ట్రంప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













