సౌదీ టూరులో డొనాల్డ్ ట్రంప్ కత్తి డ్యాన్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సైతం స్టెప్పులేశాడు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ఆయన రాజధాని రియాద్‌లో మురబ్బా ఫ్యాలస్ మద్ద జరిగిన స్వోర్డ్ డ్యాన్స్ (కత్తులు పట్టుకుని చేసే నృత్యం)లో సరదాగా కాసేపు చిందులేశాడు. యూఎస్ ప్రెసిడెంట్ అయ్యాక ట్రంప్ ఫారిన్ ట్రిప్ వేయడం ఇదే మొదటిసారి. సౌదీ తర్వాత ఇజ్రాయెల్, వాటికన్ సిటీ, బెల్జియం, ఇటలీ దేశాలను విజిట్ చేసి నాటో, జీ7 సమ్మిట్‌లో ట్రంప్ పాల్గొనబోతున్నారు. అమెరికా విదేశాంగ, వాణిజ్య మంత్రులు రెక్స్ టిల్లర్సన్, విల్బర్ రాస్‌లతో కలిసి ట్రంప్ రియాద్ చేరుకున్నారు.













