ట్రంప్ అభిశంసనపై బెట్టింగులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అభిశంసన చేయటం ద్వారా పదవి నుంచి దింపేస్తారన్న వదంతులు అమెరికాలో ఊపందుకున్నాయి. ఆయన ఉంటారా? పోతారా? అన్నదానిపై ఆన్లైన్లో అత్యధికంగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఆన్లైన్ పొలిటికల్ స్టార్ మార్కెట్ ప్రెడిక్ట్ఇట్ లో గత రెండు రోజులుగా ఈ ప్రశ్నపై ఎక్కువ మంది పందెంకట్టారు. ఇప్పటివరకూ దాదాపు లక్షకు పైచిలుకు మంది ప్రెడిక్ట్ఇట్లో ట్రంప్ ప్రశ్నపై బెట్ చేశారు. ట్రంప్ అభిశంసనకు గురవుతారని ప్రెడిక్ట్ఇట్లో గతవారం 7శాతం మంది భావించగా, మొన్నటి బుధవారం ఒక్కరోజే ఇలాంటి వారి సంఖ్య 33 శాతానికి వెళ్లింది. సాంయత్రానికి మళ్లీ తగ్గి 24 శాతానికి చేరింది. ప్రెడిక్ట్ఇట్ను వాషింగ్టన్ పొలిటికల్ కన్సల్టెన్సీ అరిస్టోటిల్, విక్టోరియా యూనివర్సిటీ-వెల్లింగ్టన్లు నిర్వహిస్తున్నాయి. ఇందులో రిజిస్టర్ అయినవారందరూ అమెరికన్లే. అత్యధికులు ట్రంప్ పూర్తి కాలం పదవిలో కొనసాగరని 5 వేల డాలర్లు బెట్ చేసినట్టు జుక్మేకర్ పాడీ పవర్ జెట్ఫెయిర్ చెప్పింది.













