డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కొమెని పదవి నుంచి తొలగించారు. ట్రంప్ నిర్ణయంపై డెమాక్రాట్లు మండిపడ్డారు. రష్యాతో ట్రంప్‌నకు ఉన్న సంబంధాలపై ఎఫ్‌బీఐ విచారిస్తున్న సమయంలో ఆ సంస్థను ప్రభావితం చేసేందుకు తాజా చర్య తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. అయితే, క్లింటన్ ఈ-మెయిల్స్ దర్యాప్తు అంశానికి సంబంధించి గతవారం కాంగ్రెస్‌కు సరైన సమాచారం ఇవ్వని కారణంగానే ఆయన్ను తొలగించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌కు పదేళ్ల కాల వ్యవధి ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా మాత్రమే పదవిలో ఉన్న కొమెను తొలగించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.













