డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా సైన్యంలో లింగ మార్పిడి చేసుకున్న వారికి స్థానం లేదని సృష్టం చేశారు. బుధవారం దీనిపై ట్రంప్ వరుస ట్వీట్లు చేశారు. సైనికులు యుద్ద విన్యాసాలు, విజయాలపై దృష్టి పెట్టాలేకాని వైద్య ఖర్చులకు భారీగా ఖర్చు చేయడం, లింగ మార్పిడి వ్యక్తులతో ఇబ్బందులు కలగడం సరైన పద్దతి కాదన్నారు. అందరి నిపుణులను సంప్రదించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ట్రంప్ తెలిపారు. ఇప్పటికే సైన్యంలో లింగ మార్పిడి వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికిప్పుడు దీనిని అమలు చేయడమంటే వీలుకాదని, అయితే ట్రాన్స్ జెండర్స్ దరఖాస్తులను ఇకపై అనుమతించమని పెంటగాన్ తెలిపింది.













