జేమ్స్ కోమీ ఓ లీకు వీరుడు … ట్రంప్
అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ మాజీ అధిపతి జేమ్స్ కోమీ ఓ లీకువీరుడని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అక్కసుతోనే ట్రంప్ తనను పదవి నుంచి తొలగించారన్న కోమీ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. ఎన్ని తప్పుడు అభిప్రాయాలు, పసలేని ఆరోపణలున్నా నిర్మూలన పూర్తయ్యిందని తెలిపారు. కోమీ ఓ లీకర్ అని ట్విటర్లో పోస్టు చేశారు.








