ట్రంప్ మద్దతు ప్రకటించిన… ఓడిపోయాడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించిన అభ్యర్థి సెనేటర్‌గా ఓడిపోయారు. అలబామా రాష్ట్రానికి చెందిన 64 ఏళ్ల లూథర్ స్ట్రేంజ్కు అనూహ్యమైన ఓటమి ఎదురైంది. సిట్టింగ్ సేనేటర్గా ఉన్న స్ట్రేంజ్కు ట్రంప్ తన మద్దతును ప్రకటించారు. అయితే తాజాగా జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పలేదు. సేనేట్ రేస్‌లో ఫైర్‌బ్రాండ్ క్రిస్టియన్ కన్జర్వేటివ్ రాయ్ మూర్‌లో విజయం సాధించారు. అలబామా రాష్ట్రానికి గతంలో మూర్ చీఫ్ జస్టిస్‌గా చేశారు. వాస్తవానికి లూథర్ స్ట్రేంజ్ తరపున ట్రంప్ ప్రచారంలో పాల్గొన్నారు. తన ట్విట్టర్ ద్వారా కూడా ఆయన్ను గెలిపించాలంటూ ట్రంప్ కోరారు. కానీ ప్రైమరీ రేసులో ట్రంప్ అభ్యర్థికి అనూహ్యమైన షాక్ తగిలింది. అయితే మూర్ విక్టరీ తర్వాత ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ నుంచి లూథర్కు మద్దతుగా పోస్ట్ చేసిన ట్వీట్లను డిలీట్ చేశారు. అంతేకాదు విజేత రాయ్ మూర్కు కంగ్రాట్స్ చెబుతూ ట్రంప్ మళ్లీ కొత్త ట్వీట్ పోస్ట్ చేశారు. ట్రంప్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మూర్ కూడా ప్రకటించారు.













