ప్రధాని మోదీకి డొనాల్డ్ ట్రంప్ అభినందనలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో సంభాషించారు. ఇటీవల ఉత్తర్ప్రదేశ్, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయంపై మోదీకి ఆయన అభినందనలు తెలిపారు. అమెరికా అధ్యక్ష భవనం ఈ మేరకు తెలిపింది.







