హెచ్-2బీ వీసాల సంఖ్యను పెంచేసిన ట్రంప్
వివాదాస్పద నిర్ణయాలతో విదేశీయులను, వలసదారులను హడలెత్తించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి మాత్రం తనతీరుకు భిన్నంగా వ్యవహరించారు. జూలై 23 నుంచి జూలై 30 వరకూ అమెరికాలో జరగనున్న మేడ్ ఇన్ అమెరికా వీక్ సంబరాల సందర్భంగా విదేశీయులకు శుభవార్త వినిపించారు. ఎప్పుడూ వీసాల సంఖ్యపై పరిమితి విధించాలంటూ మాట్లాడే ట్రంప్ ఈసారి మాత్రం వీసాల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మేడ్ ఇన్ అమెరికా వీక్ సందర్భంగా హెచ్-2వీసాల సంఖ్యను మరో 15వేలకు పెంచుతూ ట్రంప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రతి యేటా 66 వేల హెచ్-2బీ వీసాలను జారీ చేసే అమెరికా, ఇకపై ట్రంప్ నిర్ణయంతో 81వేల హెచ్-2బీ వీసాలను విదేశీయులకు ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికన్లు చేయలేమనుకునే పనుల్లో ఈ వీసా ద్వారా వచ్చిన అమెరికన్లను నియమిస్తారు. ఇళ్లల్లో పనిచేసేవారు, వంట మనుషులు, స్వీపర్లు, సెక్యూరిటీ గార్డ్ వంటి నాన్ టెక్నికల్ ఉద్యోగాల్లో వీళ్లంతా పనిచేస్తారు.













