అమెరికాకు మరో ముప్పు
హార్వే, ఇర్మా హరికేన్ల దెబ్బ నుంచి కోలుకోకముందే అమెరికాకు మరో ముప్పు మంచుకొస్తోంది. సెంట్రల్ అమెరికాలో బీభత్సం సృష్టించిన నేట్ తుఫాన్, గల్ఫ్ తీరం వైపు దూసుకెళ్తోంది. ఆదివారం నాటికి హరికేన్‌గా బలపడి లూసియానాలోని న్యూఓర్లేన్స్ దగ్గర తీరం దాటే అకాశముంది. ఆ సమయంలో 38 నుంచి 50 సెం.మీ. మేర కుండపోత వర్షాలు కురుస్తాయని, గంటలకు 80 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నేట్ తుఫాన్ నేపథ్యంలో లూసియానా స్టేట్‌లో అధికారులు ఎమర్జెన్నీ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు.













