ఆత్మస్థైర్యానికి నిలువెత్తు రూపం అతను
అమెరికాలోని మాంచెస్టర్‌కు చెందిన ట్రావిస్ మిల్స్ ఆత్మస్థైర్యానికి, ధైర్యానికి నిలువెత్తు రూపం అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు అమెరికా సైన్యంలో సార్జెంట్‌గా సేవలందించాడు. ఆఫ్గానిస్థాన్‌లో జరిగిన బాంబు పేలుడులో రెండు కాళ్లూచేతులు కోల్పోయాడు. బాంబుపేలుడులో తీవ్రగాయాలై ఆసుపత్రి మంచం మీది నుంచి లేచినరోజు అతని 25వ జన్మదినోత్సవం కావడం యాదృచ్ఛికం. ఒక దశలో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయాడు. మా నాన్న తనని వదిలేసి, పాపను తీసుకొని వెళ్లిపోమని భార్యకు సూచించాడు. కష్టమైనా సుఖమైనా కలిసే అనుభవిద్దామని అతని భార్య ధైర్యం చెప్పింది. తనలాగే యుద్ధాల వల్ల తీవ్రంగా నష్టపోయినవారి కోసం ప్రస్తుతం మెయినేలో ఓ ఆశ్రయం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాడు.








