Spring Fest : డల్లాస్‌లో టీపాడ్ ‘స్ప్రింగ్ ఫెస్ట్-2026’.. ఏప్రిల్ 18న గ్రాండ్‌స్కేప్ వేదికగా మెగా ఈవెంట్
TPAD: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 18న అత్యంత భారీ స్థాయిలో ‘స్ప్రింగ్ ఫెస్ట్-2026‘ వేడుకలు జరగనున్నాయి. డల్లాస్ పరిసర ప్రాంతాల్లోని తెలుగు వారందరినీ ఒకే చోటికి చేర్చేలా ఈ ఉచిత ఫ్యామిలీ ఈవెంట్‌ను రూపొందించారు.
ఈవెంట్ హైలైట్స్:
- తేదీ,సమయం: ఏప్రిల్ 18, 2026 (శనివారం), సాయంత్రం 4:00 నుండి రాత్రి 10:00 వరకు.
- వేదిక: గ్రాండ్‌స్కేప్ లాన్ అండ్ స్టేజ్ (Grandscape Lawn & Stage), ద కాలనీ, టెక్సాస్.
ప్రత్యేక ఆకర్షణ: ప్రముఖ గాయకుడు మెహర్ చంటి బృందం (M-Live Band) అందించే లైవ్ మ్యూజిక్ షో ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
- యాంకర్: ఈ వేడుకకు వీణా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
- వినోదం: పిల్లల కోసం ప్రత్యేక ఆటలు, 360° ఫోటో బూత్, , లక్కీ డ్రా (Raffles) వంటివి ఉంటాయి.
- స్టాళ్లు: నోరూరించే ఆహార పదార్థాలు, షాపింగ్ కోసం ఫుడ్ , వెండర్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
- ప్రవేశం: అందరికీ ప్రవేశం , పార్కింగ్ పూర్తిగా ఉచితం.
నిర్వాహకులు:
TPAD అధ్యక్షురాలు లక్ష్మి పోరెడ్డి, ట్రస్టీ చైర్ రవికాంత్ మామిడి, కోఆర్డినేటర్ లింగారెడ్డి ఆల్వ, , ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు నేతృత్వంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాంకర్ వీణ ఈ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. తెలుగు కమ్యూనిటీ ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
ఇవి కూడా చదవండి







