దీపావళి పండుగ సందర్భంగా “ఇడుపు కాయితం” సినిమా నుంచి ‘బారాత్ బీట్..’ సాంగ్ రిలీజ్
డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా “ఇడుపు కాయితం”. ఈ సినిమాలో ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా “ఇడుపు కాయితం” సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ “ఇడుపు కాయితం” సినిమా నుంచి ‘బారాత్ బీట్..’ సాంగ్ రిలీజ్ చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అదిరే బీట్ తో ‘బారాత్ బీట్..’ సాంగ్ కంపోజ్ చేశారు. శ్రీలత (నాగదుర్గ), శ్రీనివాస్ (ప్రియదర్శి) పెళ్లి బారాత్ సందర్భంగా వచ్చే డ్యాన్స్ నెంబర్ గా ఈ సాంగ్ ను రూపొందించారు. ఈ పాటలో నాగదుర్గ మాస్ డ్యాన్స్ స్టెప్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. థియేటర్స్ లో ఈ పాటకు ఆడియెన్స్ స్టెప్స్ వేయబోతున్నారు.







