అమెరికాలో సంపూర్ణ సూర్య గ్రహణం…
భారతావని నిద్రిస్తున్న సమయంలో సోమవారం రాత్రి వినీలాకాశంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. 99 ఏళ్ల తర్వాత అమెరికాలో సంపూర్ణ సూర్య గ్రహణం సంభవించింది. ఈ ఖగోళ అద్భుత దృశ్యాలను నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. గ్రహణం కారణంగా యూఎస్‌లోని 14 రాష్ట్రాల మీదుగా 70 కి.మీ మేర చీకటిమయం అయ్యింది. దక్షిణ కరోలినాలో గ్రహణం ముగిసింది. గ్రహణ దృశ్యాలను ప్రజలు ఆసక్తికరంగా తిలకించారు. గ్రహణం సందర్భంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులు ప్రకటించాయి. అమెరికాలోని ఒరెగాన్ ప్రాంతంలో సూర్యగ్రహణం ప్రారంభబైంది. సంపూర్ణ సూర్యగ్రహణ దృశ్యాలను వీక్షించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. గ్రహణం దృశ్యాలను ప్రజలు ప్రత్యేక కళ్లద్దాలతో వీక్షించారు. సంపూర్ణ సూర్యగ్రహణాన్ని విమానాల్లో నుంచి వీక్షించాలని పలువురు తహతహలాడారు. ఈ నేపథ్యంలో ఇబ్బడిముబ్బడిగా విమాన టిక్కెట్లు బుక్ అయ్యాయి. సంపూర్ణ సూర్య గ్రహణాన్ని వీక్షించిన ప్రజలు సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.













