ఐటీ కంపెనీలకు తగ్గిన హెచ్-1బీ వీసాలు
అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న ఏడు భారతీయ ఐటీ కంపెనీల్లో హెచ్-1బీ వీసా ఆమోదాలు, గత ఏడాదితో పోలిస్తే 37శాతం మేర తగ్గిపోయినట్లు ఒక నివేదిక తేల్చింది. 2016తో పోలిస్తే 5,436 మేర ఇవి తగ్గిపోయాయని వాషింగ్టన్కు చెందిన నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది. గత ఏడాది ఈ కంపెనీల హెచ్-1బీ దరఖాస్తుల్లో 9,356 మాత్రమే ఆమోదం పొందాయి. అమెరికా శ్రామికశక్తిలో వీటి వాటా 0.006 శాతం మేర మాత్రమే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసాలపై ఆంక్షలను కఠినతరం చేయడం, ఐటి రంగంలో సంక్షోభం ఏర్పడటం, ఉద్యోగులలో అభద్రతాభావం నెలకొన్న నేపథ్యంలో వీసాల మంజూరుకు సంబంధించిన ఓ నివేదిను వెలువరించింది. 2016 ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ కంపెనీలకు సంబంధించి కొత్తగా 9356 హెచ్-1బి పిటిషన్లను అమెరికా ఆమోదించినట్టు తెలిపింది.








