సన్‌స్క్రీన్ లేపనాలతో విటమిన్ డి లోపం!
సన్‌స్క్రీన్ లేపనాలను పూసుకోవడం వల్ల విటమిన్-డి లోపం పెరిగే అవకాశం ఉందనీ, ఫలితంగా కండరాల బలహీనత, ఎముకలు విరగడం వంటి ముప్పులు పెరుగుతాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. దీర్ఘకాలిక జబ్బులు, సన్స్క్రీన్ల కారణంగా తగినంత సూర్యరశ్మి దొరక్క ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది విటమిన్-డి కొరతతో బాధపడుతున్నట్లు అమెరికా టౌరో విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. ఆరుబయట గడపటం తగ్గడం, బయటికి వెళ్లినా సన్‌స్క్రీన్ లేపనాలు పూసుకోవడం వల్ల విటమిన్-డిని ఉత్పత్తి చేసే శరీర సామర్థ్యాన్ని హరింపజేస్తున్నట్లు పరిశోధకులు కిమ్ పేర్కొన్నారు. ఓ మోస్తరు సూర్యరశ్మి ప్రభావానికి గురవడం ద్వారా విటమిన్-డిని పెంచుకోవడంలో ఎంతో తోడ్పాటు లభిస్తుందని వివరించారు. సూర్యరశ్మితో ప్రయోజనాలు పొందేందుకు బీచ్‌ల్లో సూర్యస్నానానికి వెళ్లాల్సిన అవసరం లేదనీ, కాళ్లూ, చేతులపై ఎండపడేలా మామూలుగా నడిస్తే చాలని సూచించారు.













