టిఎల్సిఎ మదర్స్ డే వేడుకలు
అమెరికాలో మదర్స్ డే వేడుకలు వైభవంగా జరిగాయి. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) మరియు తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్సిఎ) సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహించాయి. న్యూయార్క్లో జరిగిన ఈ వేడుకల్లో టాటా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ రాయితం, సహోదర్ పెద్దిరెడ్డి, టిఎల్సిఎ అధ్యక్షులు శ్రీనివాస్ గూడూరులు హాజరయ్యారు. ఈ వేడుకలను టాటా జాతీయ మహిళా విభాగం కో చైర్మన్ మాధవి సోలేటీ, టాటా రీజనల్ కో ఆర్డినేటర్ ఉషా మన్నెమంద, టీసీఎల్పీఎ ఎగ్జిక్యూటివ్ ఆర్గనైజర్ శిరీషా తూనుగుంట్ల, రమా కుమారి వనం, ఉమా పొలిరెడ్డి నిర్వహించారు. 2017 మాతృదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన వారికి అభినందనలు తెలిపారు. సాధనారెడ్డి పైలా. డాక్టర్ పోలవరపు రాఘవరావు, డాక్టర్ ధర్మారావు, టి. మాధవి, సోలేటి, రంజిత్ కాయతం తదితరులు మాతృదినోత్సవం గురించి మాట్లాడారు. అమ్మను మాతృదేశాన్ని ప్రవాసులు ఎప్పటికీ మరవరన్నారు. మాతృ ప్రేమ గురించి అధిపతి భవరాజు, శృతి నండూరు, హరీష్ పాట రూపంలో పాడి ఆకట్టుకున్నారు. మిమిక్రీ రమేష్ చేసిన హాస్య విన్యాసాలు, హాస్య సంభాషణలు ఆహుతులను అలరింపజేశాయి. ముందుగా మాతృదినోత్సవం సందర్బంగా కేక్ కట్ చేసి సంతోషాన్ని అందరితో పంచుకున్నారు.













