TLCA మరియు T.A.T.A సంయుక్తంగా జరిపిన మాతృదినోత్సవ వేడుకలు
తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘము (TLCA) మరియు తెలంగాణ అమెరికా తెలుగు సంఘము(T.A.T.A) సంయుక్తంగా జరిపిన మాతృదినోత్సవ వేడుకలు 200లకి పైగా తెలుగుమహిళలతో ఘనంగా లాంగ్ఐలాండ్, న్యూయార్క్ లో మే 21 న జరిగింది. ఇదేరోజున TLCA మరియు IADHO తో సంయుక్తంగా నిర్వహించిన ఎయిడ్స్ వాక్ కార్యక్రమము సెంట్రల్ పార్క్, న్యూయార్క్ నగరంలో పెద్దలు, పిల్లలతో దిగ్విజయంగా జరిగింది.
ఇక్కడ చెప్పుకోదగిన గొప్పవిషయం ఏమిటంటే రెండుప్రోగ్రామ్స్ ఒకేటైంలో రెండు వివిధసంఘాలతో కలిసి ఘనంగా జరిపి టి.ఎల్.సి.ఏ తన సామర్ధ్యాన్ని నిరూపించింది.
మాతృదినోత్సవ వేడుకలు శ్రీనివాస్ గూడూరు, అధ్యక్షులు, TLCA. రంజిత్, RVP, T.A.T.A మరియు సహాధర్ పెద్దిరెడ్డి, RVP, T.A.T.A ప్లాన్ చేసి శిరీష తూనుగుంట్ల (ఈవెంట్లీడ్), ఉమారాణి పోలిరెడ్డి, రమాకుమారి వనమా, ఉష మన్నేం మరియు మాధవి సోలేటి (TLCA అండ్ T.A.T.A) గార్ల ఆద్వర్యంలో కార్యక్రమము ఘనంగా జరిగింది.
ఈకార్యక్రమాన్ని డా. రాఘవరావు పోలవరపు Chairman – BOT, TLCA, డా. ధర్మారావుతాపీ, సహాధ్యక్షులు, TLCA, మాధవిసోలేటి Co-Chair Womens, T.A.T.A మరియు రంజిత్క్యాతం, RVP, T.A.T.A అందరికి స్వాగతం తెలుపుతూ ఆహ్వానించగా, గాయకులు అదితిభవరాజు, శ్రుతినండూరి మరియు హరీష్ చిత్తూరు గార్లు తమ గానామృతంతో అలరించారు, అంతేకాక మిమిక్రీ రమేష్ మిమిక్రీతో ప్రేక్షకులను ఉర్రుతలూగించారు.
ఈకార్యక్రమానికి దాతలు డా. పైళ్ల మల్లారెడ్డిగారు, డా. తులసి పోలవరపుగారు, డా. శుభ అట్లూరిగారు, మరియు డా. శైలజ కాల్వగార్లకు కృతజ్ఞతలు తెలియచేసారు. అంతేకాకుండా కార్యక్రమం జరుగుటకు సహాయసహకారాలు అందించిన ప్రసాద్ సాయి, జయప్రకాష్ ఇంజపురి, అశోక్ చింతకుంట, మరియు పవన్ గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎయిడ్స్ వాక్ కార్యక్రమము శ్రీనివాస్ గూడూరు, అధ్యక్షులు, టి.ఎల్.సి.ఏ. మరియు డా. మీరాబొప్పన ఫౌండర్ IADHO ప్లాన్ చేసి డా.జ్యోతిజాస్తి మరియు బాబుకుదరవల్లి అద్వర్యంలో ఘనంగా జరిగింది. అంతేకాకుండా $3000 టార్గెట్‌ని అతి తక్కువ కాలంలో సేకరించి ఎయిడ్స్ వాక్ కప్పును పొందింది.
ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈకార్యక్రమములో పెద్దలు, పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు, ప్రత్యేకంగా టి.ఎల్.సి.ఏ. యూత్ బిందుకోయి, హర్షిని సురేష్, రిషి కుదరవల్లి, సంజన ఏరంకి, సందీపన ఏరంకి మరియు దివ్యదొమ్మరాజు పాల్గొని 8 మైళ్ళ నడకను పూర్తి చేశారు.
ఇలా ఎన్నో కార్యక్రమాలను టి.ఎల్.సి.ఏ. మన న్యూయార్క్ తెలుగు ప్రజలకు అందిస్తున్నందుకు అందరు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు.













